Christinaity and Reality, got stuck back in history?

క్రీస్టియానిటి, చరిత్ర చేతిలో బంధీ
("అన్ని మతాలు ఒకటే" అనే హిందువు భ్రమ - 1)

==> రచన: శ్రీ రాజీవ్ మల్హోత్రా 
==> అనువాదం: వడియాల రంజిత్ కుమార్ 

వివిధ మతాల మధ్య ఉన్న తేడాలని తెలుసుకోవాల్సిన, చర్చించాల్సిన అవసరం గురించి “వివిధ మతాల  మధ్య బేధాలని చర్చించవలసిన ఆవశ్యకత” అనే వ్యాసంలో వివరించాను (https://www.facebook.com/ranjith.vadiyala/posts/1560800770655916). రాబోయే కొన్ని వ్యాసాలలో ధార్మిక (హిందూ, బౌద్ధ, జైన మరియు సిఖ్ఖు) మరియు అబ్రహాం సంబంధ మతాల (ముఖ్యంగా క్రీస్టియానిటి) మధ్య ఉన్న కొన్ని ముఖ్యమైన తేడాలని వివరిస్తాను 

‘వివిధ మతాలు తమతమ మతాలకి సంబంధించిన చరిత్రకి ఇచ్చే ప్రాముఖ్యత’, ఈ తేడాలలో ఒక ముఖ్యమైన తేడా. క్రీస్టియానిటి పూర్తిగా తమ మతానికి సంబంధించిన చరిత్ర మీద ఆధార పడితే, ధార్మిక మాతాల విషయంలో చరిత్ర కేవలం ఒక చిన్న భాగం మాత్రమే. చరిత్రపై పూర్తిగా ఆధారపడే ఈ లక్షణాన్ని నేను “చరిత్ర కేంద్రకత్వం” (History Centrism) అని పిలుస్తాను. ఇది నేను చేసిన పద ప్రయోగం. వివిధ మతాల మధ్య ఉన్న సంఘర్షణలకి ముఖ్యమైన కారణం ఈ "చరిత్ర కేంద్రకత్వం".
    
క్రీస్టిక్రైస్తవం, అలానే యూదు మతాలకి వాటి చరిత్ర ఎంత ముఖ్యమో తెలియజేసే సంఘటన ఒకటి తెలియజేస్తాను. కొన్ని సంవత్సరాల క్రితం, హిందూ మతం గురించి మాట్లాడే నిమిత్తమై నన్ను, న్యూజెర్సీ, USA కి చెందిన ఉన్నతాధికారుల సామావేశానికి ఆహ్వానించారు. వారిని కొన్ని ప్రశ్నలు అడగటం ద్వారా నేను నా ప్రసంగాన్ని ప్రారంభించాను. అవి, "మీ మత చరిత్ర మొత్తం తప్పు అని నీరుపించబడినా లేదా మీకు అందుబాటులోకి రాకపోయినా అది మీ మత సంబంధ జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుంది?", "కొన్ని చారత్రక సంఘటనల ద్వారా గాడ్* (గాడ్ ≠ దేవుడు) పంపాడని చెప్పబడుతున్న జ్ఞానం మీకు అందుబాటులో లేకపోతే, మత సంబంధ జీవితం గడపటం మీకు సాధ్యమేనా?", "ఇంకో రకంగా చెప్పాలి అంటే, తన దూత ద్వారా గాడ్ పంపిన జ్ఞానాన్ని ఎవరికి వారు తెలుసుకోవడం సాధ్యపడుతుందా?" ఈ ప్రశ్నలు వాళ్ళని ఇబ్బంది పెట్టాయి, కొందరికి చాలా కోపం కూడా తెప్పించాయి. అటువంటి పరిస్థితులలో మనిషి మతపరమైన జీవితం గడపటం అసాధ్యం అని అందరూ ఒప్పుకొన్నారు. గాడ్ పంపిన దూతల వల్ల తప్పా వేరే విధంగానూ పరమ సత్యాన్ని తెలుసుకోవడం సాధ్యం కాదు అనేది వారి ఉద్దేశం.  

ఈ ప్రయోగం వల్ల నాకు క్రైస్తవ మతాలకి చరిత్ర ఎంత ముఖ్యమో బాగా  అర్ధమయ్యింది. "ఒక హిందువుగా, యోగ సాధన ద్వారా నేను సాధించగలిగే ఆధ్యాత్మిక ప్రగతికి, యోగ శాస్త్రాన్ని ఇచ్చిన ఋషుల జీవిత చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం లేదు," అని వారికి చెప్పాను. అంతేకాక వేదమంత్రాల ప్రయోజనం పొందడానికి ఆ మంత్ర ద్రష్టలైన ఋషుల జీవిత చరిత్రలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నిజానికి వేదాలని అపౌరుషేయాలు అని అంటారు (ఎవరి చేతా రచింపబడినవి కావు). అలాగే భజన వల్ల ప్రయోజనం పొందడానికి ఏ భక్తుని చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అందువల్ల ధార్మిక మతాలకి చెందిన వారికి అబ్రహాం సంబంధ మతాల వారిలా, ‘ఆధ్యాత్మిక ప్రగతి’కి చరిత్ర అవసరం పెద్దగ ఉండదు. ప్రతీ మనిషికీ పుట్టుకతోనే "ఋషి సామర్ధ్యం" ఉంటుంది. అంటే ప్రయత్నం చేస్తే ఎవరైనా ఋషి కాగలరు. దీనికి కావాల్సింది ఆధ్యాత్మిక సాధనే కాని, చరిత్ర కాదు. అందువలనే మన దేశంలో నేటికీ పరమ సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్న రామకృష్ణ పరమహంస, కంచి పరమాచార్య, రమణ మహర్షి, వంటి ఋషులు, యోగులు వస్తూనే ఉంటారు. ఈ  చర్చ ద్వారా ఈ సమావేశానికి హాజరైన వారిలో చాలా మందికి తమ మతంలో తమకే తెలియకుండా ఉన్న ఒక చీకటి కోణం తెలియజేసినట్టయింది.   

అయితే, ఎందుకు ఈ మతాలు చరిత్రలోని కొన్ని ప్రత్యేక సంఘటనలపై ఇంతగా ఆధారపడుతున్నాయి? వ్యవస్థీకృతమైన ఈ మాతాలు చరిత్ర చేతిలో బందీలా? ఈ విషయాలు తెలుసుకోవడం చాలా అవసరం. మత ఘర్షణలకి ముఖ్యమైన కారణం "చరిత్ర కేంద్రకత్వమే" అనేది గమనించాల్సిన విషయం. మత మార్పిడులు చెయ్యడానికి తమ మత చరిత్రని విస్తృతంగా ఉపయోగించే క్రీస్టియానిటీ, తమ మతం చాలా శాస్త్రీయమైనది (సైంటిఫిక్) అని ప్రచారం చేయ్యడానికి ఉద్దేశించబడిన సమావేశాలలో మాత్రం ఈ చరిత్ర గురించి మాట్లాడకపోవడం గమనించాల్సిన విషయం. ఫోర్డ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన "వరల్డ్ కాన్ఫరెన్స్ ఆన్ సైన్స్ అండ్ రిలీజియన్" లో నేను పాల్గొన్నప్పుడు ఈ విషయం గమనించాను.  

"చరిత్ర కేంద్రకత్వం" అంటే ఏమిటి?

దాదాపు అన్ని మతాలూ, అలానే మతాలతో సంబంధంలేని సిద్ధాంతాలు, ఆధునిక విజ్ఞానశాస్త్రం, అన్నీ కూడా మానవ మేధస్సుకి ఉన్న పరిమితిని అంగీకరించాయి. అయితే ఈ పరిమితిని అధిగమించే మానవ సామర్ధ్యం విషయంలో మాత్రం వీటి మధ్య ఏకాభిప్రాయంలేదు. హిందూ, బౌద్ధ ధర్మాలు మానవుని ఈ పరిమితికి కారణం "మాయ" అని, ఆధ్యాత్మిక సాధన ద్వారా దీనిని అధిగమించి, పరమ సత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోవచ్చునని చెప్పాయి. అదే సమయంలో అబ్రహం సంబంధ మతాలలోని చాలా శాఖలు, మనిషికి గాడ్ కీ మధ్య అనంతమైన, అధిగమించలేని,  దూరం లేదా జ్ఞాన సంబంధమైన ఖాళీ (మాయ వంటిది) ఉన్నదని నమ్ముతాయి. అందుకే ఆ మతాలలో గాడ్ తన దూతల (యేసు క్రీస్తు, మహమ్మద్ ప్రవక్త మొ. వారు) ద్వారా పంపిన "దేవుని వాక్యాల" ద్వారా మాత్రమే ఆ పరమ సత్యం గురించి మనిషికి తెలిసే అవకాశం ఉంటుంది. వేరే ఏ మార్గాలూ లేవు. అందుకే ఈ మతాలకి ఆ ప్రవక్తల చరిత్ర అంత ముఖ్యం.  

ధార్మిక మతాలు ఆధ్యాత్మిక సాధన ద్వారా ఆత్మతత్వాన్ని, పరమసత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయోగాలని ప్రోత్సహిస్తే, అబ్రహాం సంబంధ మతాలు తాము ఆ గాడ్ తన దూతల ద్వారా పంపాడు అని భావిస్తున్న సందేశాన్ని సూక్ష్మాతి సూక్ష్మంగా పరిశీలనలు జరపడాన్ని ప్రొత్సహిస్తాయి. ఆ సందేశాలని ఏ మనిషీ తనకి తానుగా తెలుసుకోడానికి మార్గం లేదు, అనే ప్రగాఢ నమ్మకమే దీనికి కారణం. ధార్మిక మతాలు, ప్రతీ మనిషీ సచ్చిదానంద స్వరూపుడని, పుట్టుకతోనే అనంతమైన శక్తి కలవాడనీ నమ్ముతాయి. అందువలననే, ఏదైనా కారణం వలన చరిత్ర మొత్తం నాశనమైనా, మనిషికి ఉన్న ఈ సహజ సామర్ధ్యం వలన ఆ పరమ సత్యాన్ని తెలుసుకొని అందరికి బోధించగలిగిన వారు వస్తూనే ఉంటారు. 

అత్యధిక అబ్రహం సంబంధ మత శాఖలు, మనిషి యొక్క ఈ అనంతమైన శక్తీ సామర్ధ్యాలని అంగీకరించవు. గాడ్ తన దివ్య సందేశాన్ని తన దూతలద్వారా మాత్రమే పంపుతాడని వారు నమ్ముతారు. అందువల్లనే ఆ సందేశాన్ని, ఆ సందేశాన్ని తీసుకువచ్చిన దూతకి సంభందించిన చరిత్రని కోల్పోవడాన్ని వారు ఊహించనైనా లేరు.

ఏది చరిత కేంద్రకత్వం కాదు? 

చారిత్రకత, చరిత్ర కేంద్రకత్వం వేరువేరనే విషయం అందరూ గమనించాలి. న్యూటన్ ప్రతిపాదించిన గురుత్వాకర్షణ సూత్రాలు పని చెయ్యడానికి అతని వ్యక్తిగత చరిత్ర అవసరం లేదు. అయితే , ప్రక్రైస్తవులు మనిషికి పుట్టుకతోనే దాపురిస్తుందని భావించే "నిత్య శిక్ష" నుండి రక్షణ పొందటానికి జీసస్ వ్యక్తిగత జీవితంలోని కొన్ని సంఘటనలే కారణం. అంటే చరిత్ర కేంద్రకత్వం క్రైస్తవంలా, భౌతిక శాస్త్రానికి వర్తించదు. 

"చరిత్ర కేంద్రకత్వం" కలిగిన మతాల ముఖ్య లక్షణాలు 

• గాడ్ తన దూతని/కుమారుడిని పంపడం ద్వారా చరిత్రలో జోక్యం చేసుకొంటాడు. ఈ జోక్యం సాధారణమైనదిగా కాకుండా, మానవజాతి మొత్తాన్ని, శాశ్వతంగా ప్రభావితం చేసేదయ్యుంటుంది. 
• ఈ జోక్యం కేవలం ఒకే ఒక్కసారి మాత్రమే ఉంటుంది. అంటే గాడ్ తన దివ్య సందేశాన్ని మానవులకి కేవలం ఒకే ఒక్కసారి తన దూత/కుమారుడి ద్వారా పంపుతాడు. ఏ కారణం వల్లైనా దానిని మానవులు కోల్పోతే దానికి తిరిగి పొందటం అసాధ్యం. 
• గాడ్ జోక్యం వలన చట్టాలు, నియమాలు మారిపోతాయి. 
• ఈ జోక్యం ద్వారా ఏర్పడ్డ కొత్త నియమాలకి అనుగుణంగా అప్పటి వరకు ఉన్న నాగరికతలని/సమాజాలని/నియమాలని అణచివేయడం, అబద్దం అని నిరూపించడం, పునర్నిర్మించడం లేదా పూర్తిగా నాశనం చెయ్యడం తప్పనిసరి. అందువల్లనే గాడ్ జోక్యం తరువాతి కాలం అంతకు ముందు కాలానికి కొనసాగింపులా కాకా, కొత్త ప్రారంభంలా ఉంటుంది. మరోలా చెప్పాలి అంటే గాడ్, తన జోక్యం ద్వారా ఏర్పరచిన కొత్త నియమాలు ప్రామాణికం కావాలి అంటే పాత వాటిని నాశనం చెయ్యడం తప్పని సరి. ఈ కారణం వల్లనే ఎన్నో నాగరికతలని క్రీస్టియానిటీ నాశనం చేసింది, చేస్తోంది.      

క్రీస్టియానిటి చరిత్ర కేంద్రక మతమా?

క్రీస్టియానిటీకీ చెందిన అత్యధిక శాఖలు, క్రైస్తవుడిగా జీవించడానికి, ఏ వృత్తాంతాన్ని నమ్మటం కనీస అవసరం అని నమ్ముతాయో, దానిని మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను 

• గాడ్, సృష్టి మొదట్లో ‘ఆదాము, అవ్వ’లని సృష్టించాడు 
• గాడ్ వారిని ఒక వృక్షానికి చెందిన పండ్లని తినవద్దని ఆదేశించాడు. కాని వారు ఆ ఆదేశాన్ని ధిక్కరించడం ద్వారా ‘ఆదిపాపా’నికి పాల్పడ్డారు. ఆ ఇద్దరు చేసిన ఒకే ఒక్క తప్పు వలన, వారి తరువాత పుట్టిన మానవజాతి అంతటికీ చనిపోయిన తరువాత శాశ్వత నరకంలో పడతారు అని గాడ్ శిక్షని విధించాడు. దానినే "నిత్య శిక్ష" అంటారు
• తరువాత కొంత కాలానికి మనుష్యులపై జాలి కలిగిన గాడ్ మనుషులని రక్షించడానికి, తన ఏకైక కుమారుడైన యేసును పంపాడు. అలా వచ్చిన జీసస్ మన బదులుగా, శిలువపై శిక్షను అనుభవించి, నిత్యశిక్ష నుండి మనకి విముక్తి కలిగించాడు. దీనినే రక్షణ పొందటం అంటారు. అయితే ఈ రక్షణ కేవలం, యేసు చరిత్రని నమ్మి క్రైస్తవులుగా మారిన వారికి మాత్రమే లభిస్తుంది.   
• అంత్య కాలము (End of Time): కొంతకాలానికి ఈ సృష్టి అంతమైపోతుందని, దానిని అంత్యకాలమంటారని, అప్పుడు యేసు మళ్ళీ తిరిగివచ్చి క్రైస్తవులనందరినీ శాశ్వత స్వర్గానికి, కానివారందరినీ శాశ్వత నరకానికి పంపుతాడనేది క్రైస్తవుల నమ్మకం. అంటే, ఒకడు స్వర్గానికి వెళ్తాడా నరకానికి వెళ్తాడా, అనేది ఆ మనిషి తను జీవించి ఉండగా చేసేన మంచి చేడులు కాక అతని మతం నిర్ణయిస్తుంది.

భారతీయ అధ్యాత్మిక విద్య వలన ప్రభావితమై చరిత్ర మీద ఎక్కువగా ఆధారపడని క్రీస్టియానిటీని భోదించిన వారు లేకపోలేదు. అయితే వారి సంఖ్య చాలా తక్కువ. పొరుగు వారిని ప్రేమించడం, అవసరమైన వారికి సేవ చెయ్యడం, అబద్దం ఆడకపోవడం లాంటి చరిత్రతో సంబంధం లేని క్రీస్తు బోధలు ఎన్నో ఉన్నయి. అయితే ఇవి అన్ని మతాలలోనూ ఉండేవే. అందువల్ల కేవలం వీటిని ఉపయోగించి మత మార్పిడులు చెయ్యడం కుదరని పని. మత మార్పిడులకి, నీ మతం వేరే మతం కన్నా ఎందుకు భిన్నమో/గొప్పో చెప్పగలగటం చాలా అవసరం. మిగిలిన వారిలో ఆ స్పష్టత ఉంది. "అన్ని మతాలు ఒక్కటే" అనే భ్రమలో బ్రతికేది కేవలం హిందువులు మాత్రమే. 

దీనికి ముఖ్యమైన కారణం మనం పూర్వపక్షం (ఎదుటి వారి సిద్ధాంతాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చెయ్యడం) - ఉత్తర పక్ష (అలా అధ్యయనం చేసిన తరువాత మన సిద్ధాంత దృష్టికోణంతో ఆ సిద్ధాంతాన్ని అవసరమైనంత వరకు విమర్శించడం/ఖండించడం) సంప్రదాయాన్ని క్రైస్తవ, ఇస్లాంలకి వర్తింప చెయ్యకపోవడం. కేవలం ఈ పూర్వ పక్ష - ఉత్తర పక్షాల ద్వారానే ఆదిశంకరులు హిందూమతాన్ని పునః ప్రతిష్ఠించారని మరచిపోవద్దు 

End Notes

* గాడ్ ≠ భ్రహ్మము/ఈశ్వరుడు/దేవుడు/దేవి/భగవంతుడు/దేవుడు 

తేడాలు చాలానే ఉన్నా, అందులో ఒక ముఖ్యమైన తేడా, మనము బ్రహ్మము ఈ సృష్టి అంతా వ్యాపించి ఉంటాడని నమ్ముతాము కాని క్రీస్టియానిటి దృష్టిలో గాడ్ ఈ సృష్టి నుండి అనంతమైన దూరంలో సృష్టి కి వేరు గా ఉంటాడు.

Comments

Popular posts from this blog

Polaravaram Project