Posts

Showing posts from February, 2018

Christinaity and Reality, got stuck back in history?

క్రీస్టియానిటి, చరిత్ర చేతిలో బంధీ ("అన్ని మతాలు ఒకటే" అనే హిందువు భ్రమ - 1) ==> రచన: శ్రీ రాజీవ్ మల్హోత్రా  ==> అనువాదం: వడియాల రంజిత్ కుమార్  వివిధ మతాల మధ్య ఉన్న తేడాలని తెలుసుకోవాల్సిన, చర్చించాల్సిన అవసరం గురించి “వివిధ మతాల  మధ్య బేధాలని చర్చించవలసిన ఆవశ్యకత” అనే వ్యాసంలో వివరించాను (https://www.facebook.com/ranjith.vadiyala/posts/1560800770655916). రాబోయే కొన్ని వ్యాసాలలో ధార్మిక (హిందూ, బౌద్ధ, జైన మరియు సిఖ్ఖు) మరియు అబ్రహాం సంబంధ మతాల (ముఖ్యంగా క్రీస్టియానిటి) మధ్య ఉన్న కొన్ని ముఖ్యమైన తేడాలని వివరిస్తాను  ‘వివిధ మతాలు తమతమ మతాలకి సంబంధించిన చరిత్రకి ఇచ్చే ప్రాముఖ్యత’, ఈ తేడాలలో ఒక ముఖ్యమైన తేడా. క్రీస్టియానిటి పూర్తిగా తమ మతానికి సంబంధించిన చరిత్ర మీద ఆధార పడితే, ధార్మిక మాతాల విషయంలో చరిత్ర కేవలం ఒక చిన్న భాగం మాత్రమే. చరిత్రపై పూర్తిగా ఆధారపడే ఈ లక్షణాన్ని నేను “చరిత్ర కేంద్రకత్వం” (History Centrism) అని పిలుస్తాను. ఇది నేను చేసిన పద ప్రయోగం. వివిధ మతాల మధ్య ఉన్న సంఘర్షణలకి ముఖ్యమైన కారణం ఈ "చరిత్ర కేంద్రకత్వం".      క్రీస్...