Posts

Showing posts from December, 2017

Polaravaram Project

పోలవరం నిర్మాణం గురించి పూర్తి వివరణ..... Dont miss ... గోదారిలో అపర భగీరథులు! ఇంజనీరింగ్‌ మహా అద్భుతం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, డిజైన్‌లో అనేక ప్రత్యేకతలు.. ప్రవాహానికి అడ్డుగా మట్టి, రాతి కట్ట మరోవైపున ప్రాజెక్టు స్పిల్‌ వే.. దేశంలోనే తొలి... భారీ డయాఫ్రం వాల్‌ 80 అడుగుల నుంచి స్పిల్‌వే కాంక్రీట్‌.. భౌగోళిక సమస్యలకు కొత్త పరిష్కారం. నాడు నింగి నుంచి గంగను భువికి తెప్పించేందుకు భగీరథుడు తపస్సు చేశాడు. పట్టువదలకుండా ప్రయత్నించి, దేవదేవులనే ఒప్పించి అనుకున్నది సాధించాడు! పుడమిని పునీతం చేశాడు! నేడు... గోదావరి నీటిని పట్టి నిలిపి, నేల తల్లికి ఆకుపచ్చ కోక కట్టేందుకు అపర భగీరథ ప్రయత్నం జరుగుతోంది. నవ్యాంధ్రకు జల-జీవనాడిలాంటి పోలవరం ప్రాజెక్టు అడ్డంకులను అధిగమించి ముందుకు సాగుతోంది! అక్కడ మహా యజ్ఞం జరుగుతోంది! నీటిని నిలిపేందుకు కొండలు బద్దలవుతున్నాయి! పుడమికి పచ్చటి హారతి పట్టేందుకు దారులు సిద్ధమవుతున్నాయి! కోరలు తొడిగిన యంత్రాలు విరామమెరుగకుండా శ్రమిస్తున్నాయి! రేపటి వెలుగుల కోసం అక్కడ వేలాది మంది స్వేదం చిందుతోంది! దేశంలో ఎక్కడా కనీవినీ ఎరుగని స్థాయిలో ఇంజనీరింగ్‌ అద్భుతం జర...